- Advertisement -
నవతెలంగాణ – రామడుగు
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చొప్పదండి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందుస్తు అరెస్టు రామడుగు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడేదేలేదంటూ,మీ పర్యటనను రైతులు, ప్రజలు అడ్డుకుంటారని వారు పేర్కొన్నారు. అరెస్టైన వారిలో మాజీ మార్కెట్ చైర్మన్లు మామిడి తిరుపతి, పూడూరు మల్లేశం మాజీ సర్పంచ్లు జగన్ మోహన్ గౌడ్, నాయకులు జూపాక మునిందర్.లంక మల్లేశం, ఆరేపల్లి ప్రశాంత్ జుట్టు లచ్చయ్య లు, ఉన్నారు.
- Advertisement -