- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూపీలోని నోయిడాలో సెక్టార్-119లోని అరణ్య సొసైటీలో ఏసీ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో సొసైటీలో గందరగోళం నెలకొంది. అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అయితే, ప్రమాద సమయంలో సొసైటీ యొక్క అగ్నిమాపక వ్యవస్థ పనిచేస్తోందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



