పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట ఆదివారం, మాజీ వార్డు సభ్యులు కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ స్వగృహంలో బాలమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీర్ల ఐలయ్యను కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ దంపతులు శాలువాతో సన్మానించి, చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య, యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిఎసిఎస్ డైరెక్టర్ యేమాల ఏలేందర్ రెడ్డి, ఇంజ నరేష్, ఎండి యాకూబ్, గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, సుంచు సంజీవ, తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా బాలమ్మ పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES