- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూర్ పట్టణ కేంద్రంలో భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది రాజా బాబు గౌడ్ సోమవారం మట్టి వినాయకులను ఎస్సై ఆంజనేయులు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింబాద్రి, మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, కిరణం అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్, అశోక్, నాగరాజు, యువజన సంఘాల నాయకులు, గౌడ సంఘం ప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, యువత పాల్గొన్నారు.
- Advertisement -