Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివాసీ అభ్యర్థుల ఏజెన్సీ రిజర్వేషన్ అమలు చేయకుండా పోలీస్ ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు

ఆదివాసీ అభ్యర్థుల ఏజెన్సీ రిజర్వేషన్ అమలు చేయకుండా పోలీస్ ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దు

- Advertisement -

డాక్టర్ సాగబోయిన పాపారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు ఆదివాసీ విద్యార్థి సంఘం (ASU)
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ కోసం జూలై 29న పోలీస్ రిక్రూట్మెంట్  నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. ఏజెన్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయకుండా. జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే ఏజెన్సీ ప్రాంత ఆదివాసి నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగబోయిన పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలానికి వెళ్లి గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించి అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్లక్కార్డ్స్ తో  తమ నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.2015, 18,22 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లలో ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నిరుద్యోగ ఆదివాసి అభ్యర్థులకు 75% శాతం రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఆదివాసి  నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగినది. 2026 నోటిఫికేషన్ లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. జీవో 24 ఏజెన్సీ అభ్యర్థులుగా పరిగణిస్తే జీవో  49 ప్రకారం స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు 75% రిజర్వేషన్ కల్పించాలని గెజిట్లో పొందుపరిచిన 2026 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో హోం శాఖ గైడ్లైన్స్ పాటించకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్  నగర్ ఏజెన్సీ ప్రాంత మొత్తం పోస్టులు 910 గాను 75% ఏజెన్సీ రిజర్వేషన్ అమలు చేస్తే 682  ఉద్యోగాలు ఏజెన్సీ అభ్యర్థులకు వస్తాయి.

కానీ ప్రభుత్వం జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 10% శాతం రిజర్వేషన్ తో భర్తీ చేస్తే ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు కేవలం 92 ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సుమారు 600 మంది ఆదివాసీ నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కావున ఆదివాసీ ప్రాంతా అభ్యర్థుల ప్రత్యేక రిజర్వేషన్లను వారికి ఉన్న జీవోలను అమలు చేసి పోలీస్ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి, రాష్ట్ర డిజిపి కి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం,నిరుద్యోగ యువత  పాయం పాపారావు, జోగా రామకృష్ణ, కొట్టెం   ప్రశాంత్, బొల్లి నాగేంద్రబాబు, ఏడుల సత్యనారాయణ, సాగబోయిన నితీష్, కుంజా రాజ్ కుమార్, వట్టం దర్గా స్వామి, సిడం రామకిషన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -