- Advertisement -
ముదేల్లి సహకార సంఘం అధ్యక్షుడు సజ్జనపల్లి సాయిరాం
నవతెలంగాణ – గాంధారి
నవతెలంగాణ పత్రిక ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పత్రిక. పీడిత ప్రజల కార్మిక వర్గాలకు సామాన్య ప్రజల కష్టసుఖాలను తెలిపే పత్రిక. ప్రజా సమస్యలను అనునిత్యం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే పత్రిక నవతెలంగాణ పత్రిక. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రజాశక్తి పత్రికగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపిన పత్రిక. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నవతెలంగాణగా మారి పదో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న నవతెలంగాణ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి జర్నలిస్ట్ మిత్రులకు నవతెలంగాణ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -