- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఇన్ని రోజులపాటు గ్రూప్ వన్ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలను ప్రభుత్వానికి సూచించారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
- Advertisement -