Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాభావంతో అల్లాడుతున్న రైతులు..

వర్షాభావంతో అల్లాడుతున్న రైతులు..

- Advertisement -

 చెరువులు నింపాలని ఆర్డీఓకు వినత
నవతెలంగాణ – పరకాల

పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చెరువులు, కుంటలను వెంటనే నీటితో నింపి రైతులను ఆదుకోవాలని కోరుతూ పలువురు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికిల కిషన్ రావు సోమవారం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇప్పటికే విత్తిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాళేశ్వరం, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని కాలువల ద్వారా పరకాల డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలకు విడుదల చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

అదేవిధంగా రైతులకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని, పంటలు దెబ్బతినకుండా అత్యవసర ఉపశమన చర్యలు అమలు చేయాలని పరికెల కిషన్ రావు విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టి రైతాంగానికి అండగా నిలవాలని ఆర్డీఓను కిషన్ రావు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -