Thursday, September 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో పెరిగిన మృతుల సంఖ్య‌

నేపాల్‌లో పెరిగిన మృతుల సంఖ్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అవినీతి, సోషల్‌ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జనరేషన్‌ జెడ్‌ ఆందోళనకారులు పెద్దఎత్తున నిరసనలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నిరసనల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. తాజాగా ఈ నిరసనల మృతుల సంఖ్య 31కి చేరిందని ఆ దేశ‌ వార్తాపత్రిక ఖాట్మాండు పోస్టు నివేదించింది. త్రిభువన్‌ యూనివర్సిటీ టీచింగ్‌ హాస్పిటల్‌లోని ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం అధికారులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మొదట మృతుల సంఖ్య 25గా అధికారులు ధృవీకరించారు. ఆ తర్వాత ఒక మహిళతోపాటు ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే అంతర్జాతీయ ప్రోటోకాల్‌ను అనుసరించి తాము పోస్టుమార్టం నిర్వహించామని… వారి వివరాలను వెల్లడించలేము అని డాక్టర్‌ గోపాల్‌ కుమార్‌ చౌదరి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -