- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘CRPF కోబ్రా కమాండర్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, DRG జాయింట్ ఆపరేషన్ చేపట్టి 10 మంది నొటోరియస్ నక్సలైట్లను హతమార్చారు. రూ.కోటి బౌంటీ ఉన్న CCM మోడెమ్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌ను కూడా మట్టుబెట్టారు. మిగిలిన నక్సలైట్లందరూ గడువులోగా లొంగిపోవాలి. మార్చి 31లోపు రెడ్ టెర్రర్‌ను ఏరివేయడం ఖాయం’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -