- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించడానికి అందరం కృషి చేద్దామని, పోషణ మాస వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడి టీచర్లు అవగాహన కల్పించారు. శుక్రవారం అంగన్వాడీ టీచర్ ఇందిరా మాట్లాడుతూ…. పౌష్టికాహారం తోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని, గర్భవతులు, కిశోర బాలలో, తల్లులు పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకుంటేనే ఆరోగ్య సమాజం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ అంగన్వాడీ నుండి వచ్చే పౌష్టికాహారాన్ని తప్పకుండా పొందాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, తల్లులు, కిశోర బాలాలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -