నవతెలంగాణ – హైదరాబాద్
భారత్ – పాక్ దేశాలు ఒకదానిపైన ఒకటి మిసైల్స్, డ్రోన్స్‌తో పరస్పర దాడులు చేస్తుకుంటున్నాయి. దీంతో సరిహద్దులో్ల యుద్ధవాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిదాడిగా.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ జమ్మూ ప్రాంతంపై దాడులు చేసింది. జమ్మూలోని అనేక ప్రాంతాలపై గురువారం సాయంత్రం పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు, డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలకు పాల్పడింది. ఈ దాడుల్లో జమ్మూ ఎయిర్‌స్ట్రిప్ సహా పలు కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. భద్రతా సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్తాన్ నుండి ప్రయోగించిన 8 క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలోని అత్యాధునిక S-400 వ్యవస్థ గాల్లోనే అడ్డుకోవడంలో విజయవంతమైంది. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దీంటో పాటుగా పాక్ ఫైటర్ జెట్‌ను భారత్ ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్థాన్ లోని 9 నగరాలపై దాడులు చేస్తోంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కూడా భారత్ దాడులు చెయ్యడంతో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి పాకిస్థాన్ సైన్యం తరలించింది. పాకిస్థాన్ ప్రయోగించిన 8 మిస్సైళ్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. అలాగే పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లనూ భారత్ కూల్చివేసింది. మరోవైపు సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ అమల్లో ఉంది. అక్కడ కరెంటు సరఫరాని నిలిపివేసిన భారత్.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సైరన్లతో చెప్పింది.
లాహోర్, సియాల్‌కోట్‌లో భారత్ దాడులు – లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ నాశనం చేసింది. అందువల్ల భారత్ లోని పంజాబ్‌కి సరిహద్దులోనే ఉన్న లాహోర్ పై భారత్ చేసే దాడుల్ని పాకిస్థాన్ అడ్డుకోలేదు. ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇలా భారత్ తెలివిగా.. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసి, పాకిస్థాన్‌కి షాక్ ఇచ్చింది. మరోవైపు ఇస్లామాబాద్ లో ఏకంగా ప్రధాని ఇంటికి దగ్గర్లోనే భారత్ కాల్పులు జరపడంతో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని పాక్ సైన్యం సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.
దేశవ్యాప్తంగా హై అలర్ట్..సరిహద్దుల్లో బ్లాక్ అవుట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES