Friday, July 17, 2026
E-PAPER
Homeఆటలుఅర్జెంటీనా అదరహో

అర్జెంటీనా అదరహో

- Advertisement -

ప్రపంచకప్‌ ఫైనల్లో మెస్సీ సేన
సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 2-1తో గెలుపు

ఫిఫా ప్రపంచకప్‌ 2026

అర్జెంటీనా అదరగొట్టింది. లియోనల్‌ మెస్సీ గోల్స్‌ కొట్టడంలో మాయ చేయకపోయినా.. సహచరులు గోల్స్‌ సాధించటంలో మ్యాజిక్‌ చూపించాడు. ఫలితంగా, ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా 2-1తో అద్వితీయ విజయం అందుకుంది. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. త్రీ లయన్స్‌ (ఇంగ్లాండ్‌) ఫేవరేట్‌ ట్యాగ్‌తో ఉత్సాహంగా బరిలోకి దిగినా, లియోనల్‌ మెస్సీ సేన ఆఖరు 15 నిమిషాల్లో ఊహకందని ప్రదర్శన కనబరిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో యూరో చాంపియన్‌ స్పెయిన్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా తలపడనుంది.

అట్లాంటా (యుఎస్‌ఏ)
అట్లాంటాలో అర్జెంటీనా అద్భుతం చేసింది. ఫైనల్లో అడుగేశామనే ఆనందంలో ఇంగ్లాండ్‌ సంబురాలకు సిద్ధపడుతుండగా.. ఆఖరు 15 నిమిషాల ఆటలో అర్జెంటీనా సత్తా చాటింది. నాటకీయ ఫక్కీలో సాగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. హ్యారీ కేన్‌, జూడ్‌ బెలింగ్‌హామ్‌లపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఇంగ్లాండ్‌కు ఈ ఇద్దరి నుంచి గోల్‌ రాలేదు. లియోనల్‌ మెస్సీ మాయపై అర్జెంటీనాలు గంపెడాలు పెట్టుకోగా.. గోల్‌ కొట్టకపోయినా, సహచరులు గోల్‌ కొట్టేందుకు అవకాశాలు సృష్టించాడు. లియోనల్‌ మెస్సీ కండ్లుచెదిరే ఆటతీరు, పాస్‌లు, క్రాస్‌లతో సెమీఫైనల్లో ఇరు జట్లకు వ్యత్యాసంగా నిలిచాడు. ఓ దశలో ప్రపంచకప్‌ నుంచి నిష్ర్కమించే ప్రమాదంలో పడిన అర్జెంటీనా.. ద్వితీయార్థం ఆఖర్లో గొప్పగా రాణించింది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో స్పెయిన్‌ తలపడనుంది. స్పెయిన్‌ యూరో కప్‌ చాంపియన్‌ కాగా.. అర్జెంటీనా కొపా అమెరికా చాంపియన్‌, ఫిఫా ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టైటిల్‌ పోరులో పోటీపడనున్నాయి.

ప్రథమార్థం హోరాహోరీ
అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ రసవత్తరంగా సాగింది. ఈ రెండు జట్ల గత వైరంతో అభిమానుల్లో భావోద్వేగాలు నియంత్రణలో లేకుండా పోయాయి. ఇరు జట్ల డిఫెన్స్‌ బలంగా ఉండటంతో తొలి 45 నిమిషాల ఆటలో గోల్‌ అవకాశాలు కనిపించలేదు. ప్రత్యర్థిని భయపెట్టే స్థాయిలో ఇటు అర్జెంటీనా, అటు ఇంగ్లాండ్‌ ఆడలేదు. లియోనల్‌ మెస్సీ చుట్టూ అర్జెంటీనా వ్యూహం నడువగా.. హ్యారీ కేన్‌, బెలింగ్‌హామ్‌ చుట్టూ ఇంగ్లాండ్‌ నడిచింది. ప్రథమార్థం 0-0తో గోల్‌ లేకుండా ముగిసింది.

ఆరంభం ఇంగ్లాండ్‌దే, ముగింపు అర్జెంటీనాది
ద్వితీయార్థంలో త్రీ లయన్స్‌ జోరు పెంచింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై నిలకడగా ఎదురుదాడి చేసింది. 55వ నిమిషంలో రోజర్స్‌ అందించిన క్రాస్‌ పాస్‌ను గోల్‌ పోస్ట్‌ ముందు కాచుకున్న ఆంటోని గోర్డాన్‌ గోల్‌గా మలిచాడు. దీంతో ఇంగ్లాండ్‌ 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో ఐదు నిమిషాల్లో రెగ్యులర్‌ ఆట ముగుస్తుందనగా అర్జెంటీనా వెనుకంజలోనే నిలిచింది. ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. లియోనల్‌ మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండేజ్‌ గోల్‌గా మలిచాడు. దీంతో 85వ నిమిషంలో 1-1తో స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్‌ ఇంకాసేపట్లో అదనపు సమయానికి దారితీస్తుండగా.. లియోనల్‌ మెస్సీ మళ్లీ మాయ చేశాడు. మెప్సీ క్రాస్‌ పాస్‌ అందుకున్న లాటెరో మార్టినెజ్‌ (90+2వ నిమిషంలో) గెలుపు గోల్‌ కొట్టాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 64 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న అర్జెంటీనా.. ఇంగ్లాండ్‌ గోల్‌పోస్ట్‌పై 14 సార్లు దాడి చేసింది. ఇంగ్లాండ్‌ 55వ నిమిషంలో గోల్‌ కొట్టిన తర్వాత ఆటలో జోరు తగ్గింది. అప్పటి వరకు అర్జెంటీనాకు అడుగడునా నిలువరించిన ఇంగ్లాండ్‌ డిఫెన్స్‌.. ఆధిక్యం దక్కిన తర్వాత సన్నగిల్లింది. ద్వితీయార్థం ఆఖర్లో బంతి ఎక్కువగా ఇంగ్లాండ్‌ పెనాల్టీ ఏరియాలోనే కనిపించింది. అర్జెంటీనా ఎటాకింగ్‌ స్టయిల్‌ ఆటతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే అర్జెంటీనా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లియోనల్‌ మెస్సీ గోల్‌ కొట్టకపోయినా.. సహచరుల నుంచి గోల్స్‌ రాబట్టాడు. ఈ విజయంతో విమర్శకులకు అర్జెంటీనా దీటైన సమధానం ఇచ్చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -