Friday, July 17, 2026
E-PAPER
Homeఆటలుగ్రామీణ క్రికెటర్లకు టీజీ20 మంచి అవకాశం : సీఏం రేవంత్‌రెడ్డి

గ్రామీణ క్రికెటర్లకు టీజీ20 మంచి అవకాశం : సీఏం రేవంత్‌రెడ్డి

- Advertisement -

తెలంగాణ గ్రామీణ క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు టీజీ20 లీగ్‌ మంచి అవకాశమని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. టీజీ20 అరంగ్రేట సీజన్‌ విజేతగా నిలిచిన హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌ జట్టును గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఏం అభినందించారు. ‘ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఆ రంగంపై గౌరవం ఉండాలి. ఆసక్తితో ముందుకు సాగాలి. ఫోకస్‌ లేకపోతే ఏ రంగంలోనైనా రాణించలేము. గ్రామీణ క్రికెటర్లకు టీజీ20 ఒక మంచి అవకాశం. టీజీ20 విజేతలుగా నిలిచిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరందరూ దేశ ప్రతిష్ట పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని’ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ చాంపియన్స్‌ ఆటగాళ్లతో అన్నాడు. కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, అథ్లెటిక్స్‌ మాజీ కోచ్‌ నాగపురి రమేశ్‌, ఈనాడు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -