నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ICAI ప్రకటించింది. ఇవాళ నుంచి నుంచి మే 14 వరకు జరగాల్సి ఉంది. సీఎ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. తిరిగి నిర్వహించేది ఎప్పుడో త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు వచ్చే 3 రోజుల పాటు విద్యా సంస్థలన్ని మూసి వేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించేసింది.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ మొదలైంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి.. అర్ధరాత్రి రెండు గంటల వరకు పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ ఏకధాటిగా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. పాకిస్తాన్ ప్రధాని ఇంట్లో నుంచి పారిపోయి బంకర్లో దాచుకున్నాడు. బార్డర్ లో ఉన్న జమ్ము కాశ్మీర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు.. సెలవులు లేకుండా ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా CA పరీక్షలు వాయిదా
- Advertisement -
- Advertisement -