- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీర్కూర్ ఎస్ఐగా మహేందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐ గా పని చేసిన రాజశేఖర్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి బదిలీ అయ్యారు. కామారెడ్డిలో వీఆర్‌లో ఉన్న మహేందర్ బీర్కూర్‌కు ఎస్ఐగా బదిలీపై వచ్చారు. గతంలో ఆయన పెద్ద కొడప్‌గల్ ఎస్ఐగా పని చేశారు. బదిలీపై వెళ్తున్న ఎస్ఐగా రాజశేఖర్, బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎస్ఐ మహేందర్ బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై అమృత, హెడ్ కానిస్టేబుల్ నందు, సిబ్బంది లక్ష్మణ్, శివ, గంగాధర్, భాను స్వాగతం పలుకుతూ సన్మానించారు. అలాగే మండల మాజీ ప్రజా ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -