- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టామ్ హాలాండ్ హీరోగా వస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హార్ట్‌ఫోర్‌షైర్, వాట్‌ఫోర్డ్‌లోని లీవెస్‌డెన్ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతుండగా, టామ్ పైనుంచి కిందపడిపోవడంతో తలకు గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. ఆగస్టులో ప్రారంభమైన ఈ సినిమా 2026 జులై 31న విడుదల కానుంది. అయితే, ఈ ప్రమాదం నేపథ్యంలో విడుదల తేదీ మారే అవకాశం ఉంది.
- Advertisement -