- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలము మల్లాపూరం, గురువారం, స్వచ్ఛతోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామస్థులందరి బాగస్వామ్యంతో ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్ కార్యక్రమంలో శ్రమ దానం నిర్వహించారు. గ్రామము అంతయు కలియాతిరిగి పశువైద్యశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీడీవో కె నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ మంగ సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి కర్రే విజయ వీరయ్య, మాజీ ఉప సర్పంచ్ మాదవులు, ఎంపీఓ ఎస్.చంద్ర శేఖర్, ఏపీవో లింగంపల్లి నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి ఉపేష్, ఫీల్డ్ అసిస్టెంట్ జయమ్మ, కారోబార్ శ్రీకాంత్, ఆశ వర్కర్స్, స్వయం సహాయక సంఘం సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -