- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. అల్లూరి(D) కుజభంగికి చెందిన ప్రవీణ్-లావణ్య దంపతుల రెండు నెలల బిడ్డకు వ్యాక్సిన్ వికటించి మృతి చెందాడు. అనంతపురం(D) చాబాల గ్రామానికి చెందిన రాజేష్ సరిత దంపతుల కుమారుడు అహరోన్ కుమార్(5) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి (2) డెంగీ బారిన పడి ప్రాణాలు విడిచాడు.
- Advertisement -