- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గతంలో వివిధ జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అనుభవంతో తెలంగాణపై తనకు పూర్తి పట్టు ఉందని కొత్త డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంచుతానని, సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచుతానని స్పష్టం చేశారు. పోలీస్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. న్యాయవాద వృత్తిని వదిలి ఐపీఎస్‌ను ఎంచుకున్నానని తెలిపారు.
- Advertisement -