- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో హెల్తీ మోడ్‌ను ప్రారంభించింది. తొలుత గురుగ్రామ్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో దేశంలోని ఇతర నగరాలకూ వర్తింపజేయనుంది. ఈ మోడ్‌లో.. యూజర్లు ఆర్డర్ చేసే సమయంలో పోషకవిలువలు గల ఆహారాన్ని ఎంచుకునేందుకు సలహాలు ఇవ్వనుంది. ఇందులో ప్రతి వంటకానికి పోషకాల ఆధారంగా ‘లో నుంచి సూపర్’ పేరుతో స్కోర్‌ను కేటాయిస్తారు. ఏఐ, రెస్టారంట్ డేటా ఆధారంగా ఇది పనిచేస్తుంది.
- Advertisement -