- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నై సముద్ర తీరంలో జరుగుతున్న ‘మండాడి’ సినిమా చిత్రీకరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఇద్దరు వ్యక్తులతో పాటు కెమెరాలు నీటమునిగాయి. ఇద్దరు వ్యక్తులను సినిమా యూనిట్ కాపాడింది. కెమెరాలు, ఇతర సామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ సినిమాను మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తుండగా వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. సుహాస్, సూరి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -