- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం దుర్గా నగర్ గ్రామానికి చెందిన బల్లగిరి వెంకాయమ్మ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి విన్నవించడంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా 2,50,000/- ,( రెండు లక్షల యాబై వేల రూపాయల ) కాపీని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం పట్టణంలోని పివిఆర్ భవన్ లో స్వయానా అందజేసినారు. ఈ సందర్భంగా ఎల్ ఓ సి కాపీ ఇప్పించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -