- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అందరికీ తెలుసని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వాళ్లు గమనిస్తున్నారని చెప్పారు. బీసీలకు మేలు చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు.
- Advertisement -