- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ప్రజాసేవ, సామాజిక రంగాల్లో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్విష్డ్ అవార్డు’ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంకులను ఆమె విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఈ అత్యున్నత అవార్డు ఆమెను వరించడం గర్వంగా ఉందని రామకృష్ణ తెలిపారు. భువనేశ్వరి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
- Advertisement -