దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ చెల్లించాలి

నవతెలంగాణ-జైపూర్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ రూ. 500 సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు చెల్లించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పిలుపు మేరకు నాయకులు డాక్టర్‌ రాజా రమేష్‌ ఆధ్వర్యంలో గురువారం చెన్నూర్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన బోనస్‌ సన్న, దొడ్డు వడ్లకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకుడు డాక్టర్‌ రాజారమేష్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి వడ్ల గింజను కొటామాని, క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పిన కాంస్ర్‌ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడం రైతులను నిరశాకు గురి చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్ని హామీలు నెరవేర్చామని మాట్లాడుతున్నారని విమ్మర్శించారు. రైతులకు రూ.15 వేల చొప్పున రైతు బందు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం మూడు ఎకరాలున్న రైతులకు మాత్రం రూ.10 వేల చొప్పున ఇచ్చి వంద ఎకరాలున్నా రైతు బందు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంటున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే జరిగిందని డిసెంబర్‌ 9న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు దండు కోవడం కోసం ఆగస్టు వరకు పొడగించారని అన్నారు. రైతుల పక్షాన నిలబడి దొడ్డు, సన్న వడ్లకు బోనస్‌ చెల్లించే విధంగా పోరాడుతామన్నారు. నిసన కార్యక్రమంలో చెన్నూర్‌ నాయకులతో పాటు భీమారం, కోటపల్లి, జైపూర్‌, మందమర్రి మండల నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love