వ్యవసాయ కూలీలని పట్టించుకోని బడ్జెట్

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు

నవతెలంగాణ – కంటేశ్వర్
ఎన్నికల మానిపెస్టోలో ప్రకటించిన హామీలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉపాధి కూలీలకు రోజు రూ.200 రూపాయలు కూలి 200 పనిదినాలు కల్పిస్తామన్న హామీ  ప్రస్తావనే లేదు. అలాగే వ్యవసాయ కార్మికులందరికీ సంవత్సరానికి రూ.12,000 ఇస్తామన్న విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదు. కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తామని పైపై మాటలు చెప్పినారు కానీ, స్పష్టత ఇవ్వలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కేరళ పద్ధతిలో ఉపాధి హామీ పథకాన్ని నడపాలి, రోజు కూలి రూ.600 ప్రకటించాలి. 200 దినాలు ప్రకటించాలి. ఉచిత బీమా పథకాన్ని వ్యవసాయ కూలీలకు వర్తింపచేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. నిరుపేదలైన ప్రతి ఉపాధి ఉపాధి కూలీకి ఇళ్ళ స్థలమిచ్చి ఇండ్లు నిర్మించాలి అని ఈ బడ్జెట్లో పెట్టాలి. 6 గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డుని ప్రధానంగా చూపిస్తున్నారు. కానీ, గత ప్రభుత్వం సమగ్ర సర్వే పేరుతో నిజమైన పేదల రేషన్ కార్డులే రద్దు చేయబడ్డాయి.ఇంకా అర్హులు చాలామంది ఉన్నారు. వెంటనే రేషన్ కార్డుల జారిని చేపట్టాలి, అందరికీ 6 గ్యారంటీలు వర్తించేలా ఈ బడ్జెట్‌లో ఆమోదించాలన్నారు.
Spread the love