Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంఎన్ని కల ఫలితాలపై క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణ

ఎన్ని కల ఫలితాలపై క్షేత్రస్థాయిలో లోతైన విశ్లేషణ

- Advertisement -

దిద్దుబాటు చర్యలు చేపడతాం
ప్రతిపక్ష నేతపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళంలో ఎల్‌డీఎఫ్ కు ఎదురైన ఎన్నికల పరాజయంపై రాబోయే రోజుల్లో లోతైన విశ్లేషణ నిర్వహిస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. రెండు రోజుల పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని కల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ జరిగిందని చెప్పారు. “ఈ పరాజయానికి దారితీసిన బలహీనతలను కనుగొనేందుకు లోతైన విశ్లేషణ జరుగుతోంది. పార్టీలో ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం వింటాం. పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలు, అంచనాలను కోరతాం. రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమవుతాయి. ఆ తరువాత క్షేత్రస్థాయి సభ్యుల అభిప్రాయాలను వింటారు. రాష్ట్ర కమిటీ జూన్ మొదటి వారంలో మళ్లీ సమావేశమవుతుంది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం. ఈ ఓటమికి బాధ్యతను ఏ ఒక్క నాయకుడిదిగానూ చూడలేం. ఇది అందరి బాధ్యత. ఎన్ని కలకు సంబంధించిన నిర్ణయాలలో పొరపాటు జరిగిందా? లేదా? అనేదాన్ని ఆత్మ విమర్శతో విశ్లేషిస్తాం. ఆ తరువాత, దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం. దిద్దుబాటుకు అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాక మాత్రమే ఆ చర్యలు ఏమిటో చెప్పగలం” అని ఎంఏ బేబీ అన్నారు.

“కేరళంలో ప్రతిపక్ష నాయకఁడు ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. పదేండ్ల పాలన తరువాత కేరళంలో ఓటమి ఎదురైంది. బీజేపీ మూడు సీట్లు గెలవడం తీవ్రమైన ముప్పు. సీపీఐ(ఎం)పై కాంగ్రెస్ చేసిన నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారం, మతతత్వ శక్తుల పట్ల వారు అవలంబించిన మెతక వైఖరి కేరళంలో బీజేపీ ఎదుగుదలకు దారితీశాయి. ఓటమి తరువాత కూడా వామపక్షాలకు 37.6 శాతం ఓట్లు ఉన్నాయి. మతతత్వ శక్తుల ఎదుగుదలను అరికట్టడంలో సీపీఐ(ఎం) ముందుం టుంది. అది లౌకిక-ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పరిరక్షిస్తుంది. ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహి స్తుంది. ప్రజల జీవనోపాధి, ప్రజాస్వామ్య హక్కుల జరిగే ఎలాంటి దాడినైనా ప్రతిఘటిస్తుంది” అన బేబీ అన్నారు.
“కేరళంలో జరిగినటువంటి సమీక్షా ప్రక్రియ బెంగాల్‌లో కూడా జరుగుతుంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
బెంగాల్‌లో బీజేపీ విజయం ఒక పెద్ద ఎదురుదెబ్బ. మత విద్వేష పూరిత, విద్వేష పూరిత ప్రచారం, భారీ స్థాయిలో నగదు ప్రవాహం, ఎన్నికల సంఘంతో సహా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం, సర్ ప్రక్రియతో బీజేపీ గెలిచింది. తృణమూల్ అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజాభావన కూడా బీజేపీకి లబ్ది చేకూర్చింది” అని బేబీ అన్నారు. “సీపీఐ(ఎం) నూతన ఉత్సాహంతో బెంగాల్ ఎన్ని కలకు సిద్ధమైంది. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎర్ర జెండాలతో వీధుల్లోకి వచ్చారు. ఈ ఉత్సాహం ప్రతిచోటా స్పష్టంగా కనిపించింది. ఆ దశలో కార్యకర్తల ఉత్సాహం ఓట్లుగా మారలేదు. అది ఊహించినదే.

సీపీఐ(ఎం) ఒక సీటును, లెఫ్ట్ ఫ్రంట్ రెండు సీట్లను గెలుచుకోగలిగాయి. సామాన్య ప్రజల తరపున మాట్లాడటానికి బెంగాల్ అసెంబ్లీలో ఒకరు సీపీఐ(ఎం) ప్రతినిధి ఉంటారు. పుదుచ్చేరి అసెంబ్లీలో కూడా వామపక్షాలకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. దిద్దుబాటు చర్యలతో బెంగాల్ తిరిగి పుంజుకోగలదని మాకు నమ్మకం ఉంది” అని బేబీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -