– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న మహబూబాబాద్ డీఈఓ ను సస్పెండ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మానుకోటలోని గర్ల్స్ హైస్కూల్లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎ.మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్నారని, ఇటీవల నిర్వహించబడిన ప్రమోషన్స్, ట్రాన్సఫర్లలో ఎస్సీ మహిళలకు రావాల్సిన ప్రమోషన్లు ‘రోస్టర్’ పాటించనందున ఎస్సీ పురుషులకి కేటాయించారని టిఎస్ యూటీఎఫ్ జిల్లా బాధ్యుల చొరవతో రాష్ట్ర కమిటి సహకారం కారణంగా తిరిగి మహిళలకు ప్రమోషన్స్ ఇవ్వనైనదన్నారు. వారి స్థానంలో ప్రేమోషన్ పొందిన పురుషులకు రివర్షన్ ఇవ్వటంతో వారు మానసికంగా క్రుంగిపోయారన్నారు. అనేక పొరపాట్లు చేస్తూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తున్న జిల్లా విద్యాశాఖధికారి ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్, జిల్లా కార్యదర్శులు నామ వెంకటేశ్వర్లు, కె భిక్షపతి, పి మంజుల, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జి వివేక్, సభ్యులు హరినాయక్, వివిధ మండలాల బాధ్యులు జి.సంజీవ, శ్రీనివాస్, ప్రవీణ్, రాజశేఖర్, సుందర్ కుమార్,గోవర్ధన్, వెంకన్న, వంశీకష్ణ, తిరుపతి, భద్రునాయక్, జంపయ్య, రహమాన్, యాకుబ్, ప్రభాకర్, పార్వతి, కుమార్, ప్రసాద్, మైసయ్య పాల్గొన్నారు.