గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు సన్మానం

నవతెలంగాణ – తొగుట 
మండలంలోని వెంకట్రావు పేట గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు ఘనంగా వీడ్కోల కార్యక్ర మం నిర్వహించారు. గురువారం ఈ సందర్భం గా సర్పంచ్ పాతుకుల లీలదేవి వెంకటేశం, ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులను గ్రామ పంచాయ తీ కార్యదర్శి ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా డుతూ గ్రామ అభివృద్ధి పాటుపడేలా సహకరిం చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు లో కూడా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సర్పంచ్ పదవి కాలంలో అన్ని రకాల సహాయ సహకారిం చిన అంగన్వాడీ టీచర్లుకు, ఆశా కార్యకర్తలకు, మహిళా సంఘం వివో లకు పంచాయతీ పారిశు ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ కంకణాల నర్సింలు, ఏఇవో నవీన్, కార్యదర్శి నర్సింగరావు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
Spread the love