పాము కాటుకు గురైన రైతు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఓ రైతు పాము కాటుకు గురైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక వైద్యాధికారి కెవి.సంఘమిత్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన రైతు కె.గణపతికి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా.. అక్కడ పాము(రక్త పింజర) కాటు వేసింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పాము కాటుకు విరుగుడు మందు ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం స్థానిక 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు.
Spread the love