ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో నూతన చైర్మన్ కు  ఘన సన్మానం

A great honor for the new chairman under the leadership of LHPS– ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు జాటోత్ వీరన్న నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియముతులైన  తేజవాత్ బెల్లయ్య నాయక్ కు ఎల్ హెచ్ పి ఎస్ మండల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా శాలతో సత్కరించినట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు జాటోత్ వీరన్న నాయక్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  పదవి ఈ ప్రాంత వాసి ఎస్టీల అభివృద్ధి ప్రదాత ఎస్టి హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన తేజావత్ బెల్లయ్య నాయక్ కి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అతనికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపి శాలతో ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. వీరి వెంట ఎల్ హెచ్ పి ఎస్ సీనియర్ నాయకులు గుగులోతు నారాయణ  తదితరులు పాల్గొన్నారు.

Spread the love