Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా

- Advertisement -

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియే షన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఈ మూవీని ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం హీరో, నిర్మాత వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. – ఈ సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉం టుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. కేవలం కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్ని ఇస్తే సరిపోవడం లేదు. అన్ని అంశాల్ని జోడించి సరికొత్త పాయింట్, కంటెంట్‌ను అందిస్తేనే ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. నాకు ఈ కథ మీదున్న నమ్మకం వేరే నిర్మాతలకు ఉండాలని లేదు. వేరే నిర్మాత అయితే కథ మారు స్తారని కాదు.. ఈ కథని నేను నమ్మాను. నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాను. నేను చేసిన త్రిమూర్తులు పాత్ర లోనే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానిస్టేబుల్ పాత్రకి తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తాను. ఈ సినిమా అయితే ప్రేక్షకులు ఊహించినట్టుగా రెగ్యులర్‌గా ఉండదు. సిస్టంలో ఉంటూనే పోరాడే కానిస్టేబుల్ పాత్రలో నేను కనిపిస్తాను. ఈ సినిమా చాలా వరకు రియలి స్టిక్‌గానే ఉంటుంది. పూర్తిగా ఇన్వెస్టి గేటివ్ థ్రిల్లర్‌లా ఉండదు. అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్, పాటలను పెట్టాం.

అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. ఇప్పటికే జీ టీం ఓటీటీ హక్కుల్ని తీసుకుంది. దర్శకుడు కమల్ ఈ కథ మీద చాలా వర్క్ చేశాడు. మేం దాదాపు ఏడాది పాటుగా కేవలం స్క్రిప్ట్ మీదే ఉన్నాం. కమల్ మేకింగ్, టేకింగ్ చాలా కొత్తగా అనిపించింది. త్రిమూర్తులు భార్యగా రాశీ సింగ్ అద్భుతంగా నటించారు. ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూశాక మంచి సినిమా చేశాడు అనే ఫీడ్ బ్యాక్ ఆడియెన్స్ నుంచి వస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ మెంబర్లలో ఓ వంద మంది చూశారు. అందరూ చిత్రాన్ని చూసి సర్ ప్రైజ్ అయ్యారు. నన్ను నేను ప్రమోట్ చేసుకునేలా సినిమా తీసి ఉంటానని వాళ్లంతా అనుకుని ఉంటారు. కానీ కథ, కంటెంట్ ఇవన్నీ చూసి అందరూ షాక్ అయ్యారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కథ నెమ్మదిగానే ప్రారంభం అవుతుంది. కానీ సంఘర్షణ మొదలయ్యాక.. క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా వెళ్తుం ది. క్లైమాక్స్‌ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం సోలో హీరోగా చేస్తున్నాను. అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. కథ నచ్చితే మల్టీస్టారర్ అయినా సరే చేస్తాను. కంటెంట్ నచ్చితే ఓటీటీ కోసం కూడా ప్రాజెక్ట్ చేస్తాను. నా నెక్ట్స్ సినిమాలు ఏమిటదనేది త్వరలోనే తెలియజేస్తాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -