Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక్రేజీ కాంబినేషన్..

క్రేజీ కాంబినేషన్..

- Advertisement -

హీరో శర్వానంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబోలో ఓ సినిమా రూపొంద నుంది. ఈ నూతన చిత్రానికి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం బుధవారం జూబ్లీ హిల్స్‌లో ఘనంగా జరిగింది. ‘ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షావంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీనువైట్ల ఈసారి శర్వానంద్‌తో కలిసి మరో వినోదాత్మక చిత్రాన్ని అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 'నారీనారీ నడుమ మురారీ, బైకర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న శర్వా, ఇప్పుడు శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసివస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -