Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుత్రిమూర్తులు ఫ్యాన్‌గా బయటకు వస్తారు

త్రిమూర్తులు ఫ్యాన్‌గా బయటకు వస్తారు

- Advertisement -

వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈనెల 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కేఎస్ రామారావు మaాట్లాడుతూ,’నవీన్ చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. టీజర్, ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని aకోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ చిత్రంతో వడ్డే నవీన్ కమ్ బ్యాక్ ఇస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నానుఅని దామోదర్ ప్రసాద్ చెప్పారు. రాశీ సింగ్ మాట్లాడుతూ, 'నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన కమల్ కి థ్యాంక్స్. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది అని తెలిపారు. ‘కొత్త దర్శకుడిని ఇంతలా నమ్మి అవకాశం ఇచ్చిన వడ్డే నవీన్ కి థ్యాంక్స్. ఆయనే నాకు ఈ పునాది వేశారు. ఆయనతో చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. కార్తిక్ విజువల్స్, కళ్యాణ్ ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. గత 12 ఏళ్ళగా వడ్డే నవీన్ మీద మీ ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా వడ్డే నవీన్ మీద ప్రేమతో సినిమాకి వస్తే.. త్రిమూర్తులు ఫ్యాన్‌గా బయటకు వెళ్తారు. జెన్ జీ కి కావాల్సిన కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం` అని దర్శకుడు కమల్ తేజ నార్ల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -