తప్పక సందర్శించాల్సిన టూరిజం ప్రాంతం బుద్ధవనం: మంత్రి జూపల్లి

– బుద్ధవనం అభివృద్ధితో ఆదాయంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు
– బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారు
– ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని  అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తాం
– సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను
– పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం
– బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో  తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం
– యువత్, భారతదేశానికి, ప్రపంచానికి  బౌద్ధ వారసత్వం,  సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది
నవతెలంగాణ – నాగార్జున సాగర్
తప్పక సందర్శించాల్సిన టూరిజం ప్రాంతం బుద్ధవనం అని,అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో  తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలోని బుద్ధవనంను టూరిజం ప్రమోషన్ లో భాగంగా బుద్ధవనంను స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మరియు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి తెలంగాణ పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు.బుద్ధవనానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కు బుద్ధవనం ఓఎస్డీ సూదన్‌రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి  స్వాగతం పలికారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద వారు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూపం, స్తూపవనం, జాతక వనం, ధ్యానవనంలను వారు తిలకించారు. మహాస్తూపం లోపల కొంత సేపు ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధవనంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.అనంతరం విజయ్ విహార్ లో బుద్ధవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వసతుల కల్పనపై బుద్ధవనం, పర్యాటక శాఖ అధికారులతో మంత్రి  సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కాంగ్రెస్ డి.సి.సి అధ్యక్షులు శంకర్ నాయక్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,అబ్బిడి కృష్ణారెడ్డి,నందికొండ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ,వైస్ చైర్మన్ ప్రత్యేక సలహాదారుడు ఆదాసు విక్రమ్, పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం (ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి,జిల్లా పర్యటక సమాచార అధికారి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love