చేపల వేటకు వెళ్ళి వ్యక్తి గల్లంతు

– రాకొండ గ్రామ చెరువులో ఘటన
నవతెలంగాణ-దోమ
చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన దోమ పోలిస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దోమ ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రాకొండకు చెందిన ఎండీ. యూనిస్‌ (45) అ కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌లో జీవనం సాగి స్తుండేవారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంటికి వచ్చిన ఆయన గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం గ్రామ సమీ పంలోని చెరువు దగ్గరకి చేపల వేటకు వెళ్లాడు. ఒం టిపై ఉన్న దుస్తులను చెరువు ఓడ్డుపై పెట్టి చేపలను ప టేందుకు చెరువులోకి దిగారు. ఎంతకీ చెరువులో నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన కు గురయ్యారు. వెంటనే పోలిసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అతని కోసం గాలించారు. ఆచూ కీ లభిం చకపోవడంతో కోట్‌పల్లి నుండి గజ ఈత గాళ్లను రప్పించి చెరువు మొత్తం గాలించారు. అతని ఆచూకి లభ్యం కాలేదు. దీంతో మతిస్థిమితం కొల్పోయి బట్టలు ఓడ్డుపై పెట్టి ఎక్కడికైనా వెళ్లి ఉంటారా..? అని పోలీసు లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతని అక్క కుమారుడు సమీర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చే సి దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఆచూకీ లభ్యమ య్యేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలి పారు. గల్లంతైన వ్యక్తికి భార్య పర్వీన్‌, ముగ్గురు కుతుర్లు ఉన్నారు.

Spread the love