చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

– రహదారిపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-బూర్గంపాడు
మూడేండ్ల చిన్నారిపై లైంగిక అత్యాచారం చేసిన మూర్కున్ని కఠినంగా శిక్షించాలని, బెయిల్‌ కూడా రాకుండా కేసులు పెట్టాలని సారపాక సెంటర్లో ఐద్వా మహిళా సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, దిశ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా 15 నిమిషాలు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ బూర్గంపాడు మండలం గాంధీ నగరంలో చిన్నారిపై అత్యాచారం చేసిన జార్కండ్‌కు చెందిన కుందల్‌కు జీవితాంతం బయటికి రాకుండా అధికారులు కేసులు పెట్టాలని ఆమె అన్నారు. చిన్నారిపై జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నామని, దారుణమైన బాధాకరమైన విషయమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు లీలావతి, మండల కార్యదర్శి పాపినేని సరోజన, వ్యకస మండల అధ్యక్షులు ఎస్‌.కె అబీదా, జ్యోతి, రాధా, కౌవులూరి నాగమణి, మరియమ్మ, దిశ ఎం.అన్నపూర్ణ, యు.అనిత, సుజాత, శారద, వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love