బీసీ సంఘ భవనం కేటాయించాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేత 

నవతెలంగాణ -తాడ్వాయి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంఘానికి భవనం కొరకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కి వినతిపత్రంఅందజేశారు.
60 శాతం ఉన్న బీసీ కులాల ప్రజల పలు పనుల నిమిత్తం నిత్యం జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తుంది.జిల్లా కేంద్రం నుంచి సుమారు 120 కిలోమీటర్ల దూరం నుండి సామాన్య ప్రజలు ఇక్కడికి రావడం,పనులు పూర్తి కానప్పుడు మళ్లీ వెళ్లి రావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రంలో బీసీ భవనం కోసం రెండు ఎకరాల భూమి కేటాయించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు నేత,విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మోహణాచారి,సిహెచ్ రాజయ్య, హాజీ అబ్దుల్ అజీజ్, ఈదుల్ హుస్సేన్, ప్రధానకార్యదర్శి పెద్ధోళ్ల మహేష్, నాగోజు నారాయణ రావు, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love