గాంధీ విగ్రహానికి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

నవతెలంగాణ – తాడ్వాయి: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే విధంగా చూడాలని కోరుతూ మండలంలోని అంగన్వాడి టీచర్లు ఆయాలు తాడ్వాయి మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క ఆధ్వర్యంలో కాటాపూర్ లో ని మహాత్మా గాంధీ విగ్రహానికి మాలలు వేసి సోమవారం వారి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అంతకుముందు గ్రామాలలో, మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలను అందజేయాలని పేర్కొన్నారు. 22 రోజులుగా అన్ని వదులుకొని సమ్మె చేస్తుంటే ప్రభుత్వా కనబడడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ మండల అధ్యక్షురాలు జమున, సరిత, నిర్మల, రమాదేవి, వెంకటలక్ష్మి, సుమలత, మంజుల, రుక్మిణి, ఆయాలు తదితర 80 మంది అంగన్వాడీలు ఆయాలు పాల్గొన్నారు.

Spread the love