సంపూర్ణ ఆరోగ్యానికి ఒక మాత్ర

– ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సురేష్
నవతెలంగాణ – రాయపర్తి
కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. శారీరక, మానసిక ఎదుగులపై నులి పురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్ర సరిపోతుంది అని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మచ్చ సురేష్ అభివర్ణించారు. గురువారం జాతీయ నులి నిర్ములన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఎదుగుదలకు నులిపురుగుల నివారణ అత్యంత అవసరమన్నారు. పిల్లల్లో రక్తహీనత తదితర సమస్యల పరిష్కారానికి ఈ మాత్ర ఎంతగానో పనిచేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నులి నిర్మూలన మాత్రలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గారె కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love