అమెరికా సావనీర్ లో సిద్ధాంతపు వారి రచనలకు స్థానం 

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కన్వెన్షన్ కోసం ముద్రించిన ప్రత్యేక సావనీర్ లో అశ్వారావుపేట కు చెందిన రచనలకు ప్రాధాన్యం లభించింది. ఈ సంఘం వాషింగ్టన్ లోని సీటెల్ లో నిర్వహించిన మహాసభల సందర్భంగా ప్రత్యేక సావనీర్ ను విడుదల చేసింది.ఈ సావనీర్ లో అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన  “తెలంగాణ సాహిత్య చరిత్రకు చేవ్రాలు పాల్కురికి సోమన ‘‘ అనే వ్యాసానికి, బాల కథకుడు సిద్ధాంతపు  సాత్విక్ సాయికుమార్ వ్రాసిన ‘‘ అపాయం లో ఉపాయం’’ అనే కథా రచనకు స్థానం కల్పించ బడి ముద్రించబడ్డాయి.అమెరికా మెగా కన్వెన్షన్ సావనీర్ లో తమ రచనలను ఎంపిక చేసిన సావనీర్ కమిటి ఛైర్మన్ గూడూరు శ్రీనివాస్, కమిటి సభ్యులు తొడుపునూరి శ్రీనివాస్, రాజి బుర్రా, ఏలూరిపాటి అపర్ణ, బొబ్బిలి హరిచరణ్, హరిశంకర్ రాసపుత్ర, శాంతి కృష్ణ లకు రచయితలు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రపంచ వేదికపై మరోమారు అశ్వారావుపేట కీర్తిని ఇనుమడింపచేసిన రచయితల కృషి పట్ల  సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు,సి.ఆర్.పిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love