ప్లాస్టిక్ రహిత సమాజమే మన లక్ష్యం: కలెక్టర్

– కార్యాలయాల్లో తప్పక అమలుకు చర్యలు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్లాస్టిక్ రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.  శనివారం అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లతలతో కలసి జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని,  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని పశువులు, పక్షులు, వచ్చేతరం ఆరోగ్యం గా ఉండాలంటే  ముందుగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. జిల్లా స్థాయి అమలులో ఆదనవు కలెక్టర్ స్థానిక సంస్థలు  సి.హెచ్. ప్రియాంక నోడల్ అధికారిగా అలాగే కలెక్టరేట్ కి  నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత వ్యవహరిస్తారని తెలిపారు. ముందుగా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని కార్యాలయాలు అమలు చేయాలని, రెండవ విడతలో ఆర్.డి.ఓ, ఎంపీడీఓ, తహశీల్దార్ల కార్యాలయాల్లో మూడవ విడతలో పాఠశాలలు, వసతి గృహాలు, హాస్పిటల్స్ లలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిదంగా వచ్చే మంగళవారం నుండి కలెక్టరేట్ లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు నిషేదమని లేనియెడల సంబంధిత కార్యాలయానికి జరిమాన ఉంటుందని అలాగే అన్ని కార్యాలయాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.అంతకు ముందు ప్లాస్టిక్ వలన జరిగే హాని పై వివరించారు.ఈ కార్యక్రమంలో  సి.ఈ. ఓ అప్పారావు, పి.డి. మధుసూదన్ రాజు,    ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఈడియం గఫ్ఫార్,  జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love