అ ‘ పూర్వ ‘ సమ్మేళనం

నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామ జడ్పీ హైస్కూల్ 2009 – 2010 బ్యాచ్ చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. చాలా రోజుల తర్వాత పాఠశాల ప్రాoగణానికి చేరుకున్న వారంతా ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం భోజనాలు చేసి సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బిక్షపతి, నరసింహారెడ్డి, గౌస్ మియా, జాంగిర్ అలీ, బిక్షమయ్య, నర్సింగ్ రావు, రవీందర్, రాజు, సత్యనారాయణ, రవి, రవీందర్, రంగారావు, విద్యార్థి విద్యార్థులు, పాల్గొన్నారు.
Spread the love