టెక్సాస్: భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజినీర్ అశోక్ వీరరాఘవన్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ద టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ (టామ్‌సెట్) ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారి కి ఈ అవార్డును అందజేస్తుంది.అశోక్ వీర రాఘవన్ హూస్టన్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్‌లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూ టర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.