నవతెలంగాణ – వేములవాడ
హాంకాంగ్ లో యంగ్ ఏషియన్ సైంటిస్ట్ ఫాలోషిప్ ఏ వై ఎస్ వార్షిక సమావేశం హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఏ వై యస్ ఈవెంట్ ను శుక్రవారం రాత్రి నిర్వహించగా. యువ శాస్త్రవేత్తలకు ప్రదానం చేసిన 2024 అవార్డు అందుకున్న వేములవాడ వాసి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజి జయపాల్ రెడ్డి సోదరుడు గంజి మహిపాల్ రెడ్డి భారతదేశం తరఫున అవార్డును అందుకోవడం పలువురు అభినందించారు. చైనా ,మెయిన్‌ల్యాండ్, హాంకాంగ్, మకావో, తైవాన్,భారతదేశం, జపాన్,కొరియా,సింగపూర్ ఆసియాలోనే ఆ అతిత్యమ యువ శాస్త్రవేత్తలకు పలు రంగాలలో ప్రతిభను కనబరిచిన శాస్త్రవేత్తలను అవార్డులతో సత్కరించింది అని, శనివారం జయపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.