ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం  

నవతెలంగాణ – చండూరు 
చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అర్చకుల, వేదమంత్రాల మధ్యఅంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డి హాజరై పట్టు వస్త్రాలు,తలంబ్రాలుస్వామివారికి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ లతో శాస్త్రోక్తంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలపైశ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జయరామయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ గజ్జల కృష్ణారెడ్డి,  కాంగ్రెస్ నాయకులు దోటి వెంకటేష్ యాదవ్, డాక్టర్ కోడి శ్రీనివాసులు, పల్లె వెంకన్న, కోరిమి ఓంకారం,  కోడిగిరి బాబు, అనంతుల చంద్రశేఖర్ గౌడ్, సాపిడి రాములు, కడారి లక్ష్మణ్,ఆలయ అర్చకులు కారువంగ నరసింహ శర్మ, తిరుపతయ్య శర్మ, శంకర శర్మ, గిరి ప్రసాద్ శర్మ, హరి ప్రసాద్ శర్మ,పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love