ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

నవతెలంగాణ – ఉప్పునుంతల
బ్రిటిష్ వలస వాదుల గుండెల్లో సింహస్వప్నం ,స్వాతంత్ర సంగ్రామ దిశను మార్చిన యువకిశోరం సర్దార్ షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి రాయిచెడు గ్రామంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రామ శాఖ సెక్రటరీ గొడుగు వెంకటయ్య మాట్లాడుతూ భారత జాతీయ ఉద్యమంలో పాల్గొని కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్, అతని సహచరులు రాజగురు, సుఖదేవ్,అన్నారు. భగత్ సింగ్ ఆర్థిక సమానత్వమే కాకుండా సామాజిక అసమానత్వానికి మూలమైన కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడని అన్నారు. యువత మనువాద భావజాలపై అన్యాయాలపై స్పందించాలని దోపిడీ అక్రమాలు అన్నిటిపై నిత్యం పోరాడుతూ భగత్ సింగ్ మార్గంలో నడవాల్సిన అవసరం నేడు యువతపై ఉన్నదని అన్నారు . ఈ కార్యక్రమంలో ఇంజమూరి నిరంజన్, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Spread the love