టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి గోపాల్ ను పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ బృందం

నవతెలంగాణ – ధర్మసాగర్
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి పోలుమారి గోపాల్ ను టీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు టీవీ రాజు గౌడ్ వారి బృంద సభ్యులు శనివారం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆయనను పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో అనేక ఇబ్బందులకుగురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా అనేక కష్టనష్టాలను భరిస్తూ ఓడుదోడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి సంఘం అనునిత్యం తోడు ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలకు ఆకస్మిక మరణాలకు గురైన వారికి వారి కుటుంబాలకు చేదోడువాదోడుగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. జర్నలిస్టు ఒత్తిడికి గురై అనారోగ్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులందరికీ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూనియన్ పక్షాన సభ్యులందరికీ చేయూతనియడానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి ఫెడరేషన్ బృంద సభ్యులందరూ ముందుంటారని హామీ ఇచ్చారు .ఈ మధ్యకాలంలో ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన సూర్య పత్రికలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు జిల్లా కార్యదర్శి పోలుమారి గోపాల్ గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని అతనికి ధైర్యం చెప్పారు, ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భీమదేవరపల్లి సీనియర్ పాత్రికేయులు ఐలయ్య, జిల్లా అధ్యక్షులు , కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టు ఇసంపల్లి రమేష్, దామెర వెంకటేష్, గజ్జెల్లా సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love