నా చేతుల్ని నెలంతా కీబోర్డుకి
హవనంగా వేసా…
వేల లైన్ల కౌంటింగ్‌లో
అక్కడక్కడా వొవర్ మినిట్స్ కష్టం
ఉబ్బిన చేతల సాక్షిగా వగచుతాయి
నోళ్లు తెరిచిన కొరిక గొంతుక దప్పికని
పది జీతంరాళ్లు తీర్చలేక చతికిల బడ్డాయి
ఖర్మకాలి పేయి రెస్ట్ కోరితే
మొత్తంలోని కోతలు కలవర పెడతాయి
నెల జీతం కోసం
కళ్లు కాలెండర్‌కి ఉరేసుకుంటాయి
చిరిగిన వొక్క నోటుకై
బతుకుని ఉద్యోగానికి తాకెట్టు పెట్టినాను…
మధ్యతరగతి ఆశల కేకలలో
నిత్యం సతమతవుతూ జీవిస్తున్నాను.
– పుష్యమీ సాగర్, 7997072896